ప్రజాసంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

వాహనమిత్రకు ఏలూరు వేదిక కావడం సంతోషంగా ఉంది

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

ఏలూరు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతుందని, నాలుగు నెలల పాలనలోనే ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో జరిగిన వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 2018 మే నెలలో ఏలూరు నియోజకవర్గంలో 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి హోదాలో ఇదే ఏలూరుకు వచ్చి వాహనమిత్ర పథకానికి శ్రీకారం చుట్టడం మా జిల్లా చేసుకున్న అదృష్టమన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. హామీలను తుంగలో తొక్కే ముఖ్యమంత్రులను ఎందరినో చూశాం. కానీ, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు 95 శాతం నాలుగు నెలల్లోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.

చిరకాల వాంచగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారన్నారు. కాలేజీ నిర్మిస్తామని చెప్పిన 15 రోజుల్లోనే జీఓ విడుదల చేసి రూ. 266 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి జిల్లా వాసుల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ జీవం పోస్తూ.. పథకంలో మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.. ప్రభుత్వమే ఖర్చు అంతా భరిస్తుందని చెప్పారన్నారని గుర్తు చేశారు. అదే విధంగా ఏలూరు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రిని కోరారు.

 

Back to Top