విద్యా వ్య‌వ‌స్థ‌లో పెను మార్పులు తెచ్చాం

`నాడు-నేడు` కింద రూ.11 వేల కోట్లు ఖ‌ర్చుచేస్తున్నాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

గుంటూరు: విద్యా వ్య‌వ‌స్థ‌లో అనేక సంస్క‌ర‌ణ‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌కారం చుట్టార‌ని, విద్యార్థుల‌కు మంచి భ‌విష్య‌త్తు ఇవ్వాల‌నే త‌ప‌న‌తో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్లలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు మంత్రి ఆదిమూల‌పు సురేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యారంగంపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని.. విద్యావ్యవస్థలో ``నాడు-నేడు`` కింద రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న నాడు-నేడు పనుల‌ను తెలంగాణ అధికారులు కూడా వచ్చి పరిశీలించారని, తెలంగాణలో కూడా అమలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నంబూరు శంకర్‌రావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top