పదో తరగతి పరీక్షలు రద్దు చేయం

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తూర్పు గోదావరి: పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం కుదరదని, విద్యార్థుల భ‌విష్య‌త్తు దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశామని, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష పర్టీలు డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్‌ పరీక్షల మార్కులే ప్రామాణికమన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top