సెప్టెంబ‌ర్ 5న జ‌గ‌న‌న్న విద్యా కానుక‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేప‌ల్లి:  సెప్టెంబ‌ర్ 5వ తేదీన విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న విద్యా కానుక అంద‌జేస్తున్న‌ట్లు మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. వ‌చ్చే నెల 5న పాఠ‌శాల‌లు పునఃప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. మొద‌టి ద‌శ నాడు-నేడు ప‌నులు దాదాపు పూర్తిఅయ్యాయ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న‌న్న విద్యా కానుక వ‌స్తువుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌రిశీలించార‌ని తెలిపారు. ఈ కిట్‌లో మాస్క్‌తో పాటు పుస్త‌కాలు, యూనిఫాం, బ్యాగ్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. టెక్ట్స్ బుక్స్ ఇప్ప‌టికే జిల్లాల‌కు చేరాయ‌ని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా అన్ని పాఠ‌శాల‌లు తెర‌వ‌డానికి గైడ్‌లైన్స్ ఇచ్చామ‌ని మంత్రి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top