మొదటిదశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 'నాడు-నేడు'పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. "నాడు-నేడు మొదటిదశలో 15,715 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాం. గేట్‌ కోచింగ్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చేందుకు జేఎన్టీయూ ప్రయత్నాలు చేస్తోంది. స్కూళ్లు తెరిచాక కావాల్సిన యూనిఫామ్స్‌, బుక్స్‌ సిద్ధం చేస్తున్నాం." అని వివరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top