వైయ‌స్ జగన్‌ ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్‌కు వణుకు  

గుడివాడలో టిడ్కో ఇళ్ళ పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

గుడివాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్‌కు వణుకు మొద‌లైంద‌ని  పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుడివాడ‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడారు.  
నమస్కారం, ఈ రోజు రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌ ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్‌కు వణుకు పుడుతుంది, తోడేళ్ళ గుంపు తోడై జగనన్న సంకల్పాన్ని అడ్డుకోవాలని చూసినా పట్టుదలతో ముందుకెళుతున్నారు. పేదల పట్టాభిషేకం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు చూశాం, టీడీపీకి ఓటు బ్యాంకు రాజకీయాలే కానీ పేదలంటే ప్రేమ లేదు, ఎన్నికల ముందు ప్రకటనలు, తర్వాత మ్యానిఫెస్టోని తగలబెట్టారు, టిడ్కో ఇళ్ళను చంద్రబాబు గాలికొదిలేస్తే జగనన్న వారి కలను సాకారం చేశారు, ప్రజల కోసం ఆలోచించే మనసున్న మనిషి జగనన్న, జగనన్న ఇళ్ళను కాదు ఊళ్ళను నిర్మించారు, ఎలాంటి షరతులు లేకుండా పేదలకు ఇళ్ళు ఇస్తుంటే ఎల్లో మీడియా బరితెగించి రాతలు రాస్తుంది, నాడు ప్రశ్నించని ఎల్లో మీడియా ఇప్పుడు ఇలా వ్యవహరిస్తుంది, రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో కాలనీని గుడివాడలో పూర్తిచేశాం, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కాలం చెల్లిన పొలిటీషియన్, రాష్ట్రమంతా మా భవిష్యత్‌ జగనన్నా, మా నమ్మకం నువ్వే జగనన్నా అంటున్నారు, జగనన్నా మీకు జీవితాంతం రుణపడి ఉంటామ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు.

 

Back to Top