ప్రజలు వైయస్‌ జగన్‌కు అండగా నిలవడంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

విజయవాడ:  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా నిలవడంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి ఆదిమూలపు  సురేష్‌ మండిపడ్డారు. సామాజిక న్యాయ భేరీ పేరుతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులందరం శ్రీకాకుళం నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలు, అలాగే 27 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచారు. ఈ వర్గాలన్ని కూడా సీఎం వైయస్‌ జగన్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ వర్గాలన్నీ సీఎం వైయస్‌ జగన్‌కు అండగా ఉండటంతో ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయి. ఎల్లోమీడియా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది.  
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం వైయస్‌ జగన్‌ చాలా మేలు చేశారన్నారు. దేశంలో ఎవ్వరూ ఎన్నడూ చేయని విధంగా ముఖ్యమంత్రి మేలు చేశారన్నారు. దుష్ట చతుష్టయానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదు. ప్రజలందరికీ ఈ విషయాలు తెలుసు.  దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు ఇవాళ మాట్లాడటం సిగ్గు చేటు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని హేళనగా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు ఇవాళ నీతులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top