విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

అమరావతి:  రాష్ట్రంలో  విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.   ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. విద్యా శాఖపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ సభ్యులకు నాడు–నేడు కార్యక్రమంపై చేపట్టిన పనులకు వివరించారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ఖర్చు చేసిన వివరాలను సభలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. 
– జగనన్న అమ్మ ఒడి:
బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన ప్రతి విశిష్ట తల్లి, సంరక్షకుడికి ప్రతి ఏటా రూ.15 వేల ఆర్థిక ప్రోత్సహకాన్ని అందిస్తున్నాం.  రూ.13,023 కోట్ల మొత్తాన్ని రెండేళ్లలో అందించాం. 
– మన బడి–నాడు నేడు:
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు 10 అంశాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రూ.11360 కోట్ల వ్యయానికి గాను రూ.3,669 కోట్లను ఖర్చు చేశాం. కొత్త మార్గదర్శకాల ఆధారంగా కొత్త తరగతి గదులను నిర్మించేందుకు రూ. 13,981 పాఠశాలలను మొదటి దశలో, రెండో దశలో 4,535 కోట్లు ఆర్థిక వ్యయాన్ని చేర్చడమైంది.
– జగనన్న గోరుముద్ద:
గుణాత్మక విద్యలో భాగంగా జగనన్న గోరుముద్ద  ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ప్రతి ఏటా రమారమి రూ.1600 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేస్తున్నాం.
– జగనన్న విద్యా కానుక:
విద్యార్థులకు పాఠశాల కిట్లు అందించడం ద్వారా విద్యార్థుల హాజరశాతాన్ని మెరుగుపరిచేందుకు రూ.1437.3 కోట్లను ఖర్చు చేశాం.
– మరుగుదొడ్ల నిర్వాహణ:
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వాహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. పరిశుభ్రదత, పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ.444.89 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
– పాఠశాలల నిర్వాహణ నిధి:
ఆస్తులు, భవనాలు, మౌలిక సదుపాయాల జీవిత కాలాన్ని  సకాల నిర్వాహణ పొడిస్తున్నందున ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేశాం.
– పునాది విద్య:
పాఠశాలల్లో సంస్కరణలు తీసుకువచ్చే విధానంలో భాగంగా పౌండేషన్‌ విద్యను ప్రోత్సహిస్తున్నాం. సంఖ్యాశాస్త్రంపై ఎక్కువ దృష్టి›సాధిస్తున్నాం. అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు పీఆర్‌ కోడ్‌లను శక్తివంతం చేస్తున్నాం. పాఠ్య పుస్తకాలను రీ డిజైన్‌ చేశాం. అడ్డంకులు లô కుండా సరఫరా చేస్తున్నాం.
–సీబీఎస్‌ఈ:
సీబీఎస్‌ఈ అనుబంధ చట్టాల ప్రకారం మొదటి దశలో 1000 పాఠశాలల్లో అమలు చేయాలని భావిస్తున్నాం.
– అభ్యాస ఫలితాలను మెరుగు పరిచేందుకు సమగ్ర విద్యా, సంస్కరణలు తీసుకువచ్చేందుకు శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు తీసుకువస్తున్నాం. 
– పోటీ ప్రపంచంతో ప్రభుత్వ విద్యార్థులు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

 

Back to Top