ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం

మంత్రి ఆదిమూలపు సురేష్‌  
 

తాడేపల్లి: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని మంత్రి తెలిపారు. విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్‌ అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top