చర్చల వల్లనే ఇప్పటి వరకూ మేలు జరిగింది

మంత్రి ఆదిమూలపు సురేష్‌

చర్చలకు వెళ్లి సానుకూల ఫలితాలు రాబట్టుకోవాలి

మళ్లీ మొదటికి వచ్చి సమన్యను పెద్దదిగా చేయవద్దు

విజయవాడ: ప్రభుత్వంతో చర్చల వల్లనే ఇప్పటి వరకూ మేలు జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. చర్చల ఫలితంగానే ఫిట్‌మెంట్, పదవీ విమరణ వయసు పెంపూ అన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. ఒకటికి రెండుసార్లు చర్చలు విఫలమైనా, మళ్లీ చర్చలే మంచిదని చెప్పారు. చర్చలకు వెళ్లి సానుకూల ఫలితాలు రాబట్టుకోవాలని మంత్రి సూచించారు. గురువారం మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతల అరెస్టులు అవాస్తవం..ప్రతి విషయంలోనూ ఎంతో సామరస్యంగా, ఓపికతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్చలు జరిపారు. చర్చల పర్యావసనమే ఉద్యోగుల వయో పరిమితి పెరిగింది, పిట్‌మెంట్‌ అన్సౌస్‌మెంట్‌ చేశారు. అన్ని కూడా ఉద్యోగ సంఘాలకు తెలిసీ జరిగింది. వాళ్లు తరువాత ఆలోచన చేసుకొని ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉంది. మంత్రుల కమిటీ చర్చించేందుకు సిద్ధంగానే ఉంది. ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతున్న పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు బాధ్యతతో వ్యవహరించాలి. ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు కలిగించడం సరికాదు. మళ్లీ మొదటికి రావడం సరైంది కాదన్నారు. ప్రతిసారి పీఆర్‌సీ ప్రకటించినప్పుడు ఏదో ఒక ఇష్యూ వచ్చేది. అలాంటి సమయంలో కమిటీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అనామలిస్‌ కమిటీ ద్వారా సరిదిద్దుకొని రివైజ్డ్‌గా ముందుకు వెళ్తారు. జీవో ప్రతులను తగులబెట్టడం, పే స్లీప్‌లను తగులబెట్టడం అది బాధ్యతారాహిత్యం. టీచర్లు క్రమశిక్షణగా మెలగాలని మంత్రి సూచించారు.
 

Back to Top