తిరుపతి ఉప ఎన్నికలో వార్ వన్ సైడే..

విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్‌

 మద్యం తాగండి.. టీడీపీకి ఓటెయ్యండని బాబు ప్రచారం చేయడం దుర్మార్గం

 అచ్చెన్నాయుడు వీడియో లీక్ పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరెత్తలేదు

 సీఎం వైయ‌స్ జగన్ పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది

చిత్తూరు:  తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లో వార్ వ‌న్ సైడ్‌గా ఉంటుంద‌ని..వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి అత్య‌ధిక మెజారిటీతో గెలుపొంద‌బోతున్నాడ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు.  40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో చేసిన పనులు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేకపోయార‌ని ప్ర‌శ్నించారు. అంటే ఆయన హయాంలో తిరుపతికి చేసిందేమీ లేదు కాబట్టి క‌దా అని నిల‌దీశారు.  ఇంకోపార్టీ ఏపీలో తమ పార్టీ ఉనికి చాటుకోవాలని, ఓటు బ్యాంక్‌ పెంచుకోవాలని మరోపార్టీతో జతకట్టింది. విభజన చట్టంలో ఇచ్చిన హమీలు, విశాఖ ఉక్కు గురించి, ప్రత్యేక హోదా గురించి చెప్పలేని పరిస్ధితుల్లో ఆ జాతీయ పార్టీ ఉంద‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర విభజనకు కారణమైన మరో పార్టీ కాంగ్రెస్‌ ప్రజలకు ఇప్పుడేం చెప్పాలో అర్ధం కాని అయోమయ పరిస్ధితుల్లో ఉందని పేర్కొన్నారు. తిరుప‌తి న‌గ‌రంలోని  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. 

తండ్రీకొడుకులు ఎందుకు నోరెత్తడం లేదు..
మేం చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఈ రెండు సంవత్సరాలలో ఏం చేశామో చెప్పగలిగాం, ప్రతీ ఇంటికి వెళ్ళి చేసిన పనులు, అభివృద్ది చెప్పాం కానీ టీడీపీ, బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌ ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయానా రాష్ట్రంలో పార్టీ లేదు, తొక్కా లేదని మాట్లాడారు, కానీ లోకేష్‌ మాత్రం ఇంకా సవాళ్ళు విసురుతున్నారు, టీడీపీ దివాళా తీసిన విషయం అచ్చెన్నాయుడు వీడియో ద్వారా అర్దమైంది, అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో ఫేక్‌ వీడియో అని చెప్పమనండి, లోకేష్, చంద్రబాబు ఆ వీడియో గురించి మాట్లాడమనండి. ఎందుకు తండ్రీకొడుకులు దాని గురించి నోరెత్తడం లేదు.

ఆదర్శవంతమైన పథకాల గురించి విమర్శలా?
చంద్రబాబు మాత్రం మన బడి, నాడు నేడు, అమ్మ ఒడి పథకాల గురించి విమర్శలు చేస్తున్నాడు, ఇంత ఆదర్శవంతమైన పథకాల గురించి విమర్శలా, పేద తల్లులకు భరోసా ఇచ్చే అమ్మ ఒడి పథకం అయ్య బుడ్డికి వాడుతున్నారని దారుణంగా విమర్శలు చేస్తున్నాడు, మద్యం తాగండి.. టీడీపీకి ఓటు వేయండి అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. 

దిగ‌జారుడు రాజ‌కీయాలు..
చంద్రబాబు, లోకేష్‌ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు, దిగజారుడు రాజకీయాలు, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు, మీరు చేసింది చెప్పండి కానీ అమ్మ ఒడి లాంటి పథకం గురించి అనవసర విమర్శలు వద్దు, కుప్పం నియోజకవర్గంలో కూడా నాడు నేడు కింద అన్నీ సమకూర్చామా లేదా చెప్పండి, ప్రతీ స్కూల్‌ను ఆధునీకరించి ఏం చేశామో చెప్తాం అంటే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు.

సెకండ్, థర్డ్‌ ప్లేస్‌ కోసమే ఆ పార్టీలు పోటీ ..
టీడీపీ, బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌ ఓటర్లకు ఏం చెప్పలేకపోయాయి, సీఎం వైయ‌స్ జగన్‌ గారి మీద వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని వారికి తెలుసు, సెకండ్, థర్డ్‌ ప్లేస్‌ కోసమే ఆ పార్టీలు పోటీ పడుతున్నాయి, ఇప్పటికే వార్‌ వన్‌సైడ్‌ అయింది, ఓటర్లు డిసైడ్‌ అయిపోయారు, తిరుపతి ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు అందించబోతున్నారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, సుమారు 70 శాతంపైగా ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధికి రాబోతున్నాయి, శ్రీ వైయ‌స్ జగన్‌ గారి పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

ఐదు ల‌క్ష‌ల మెజారిటీతో గురుమూర్తి గెల‌వ‌బోతున్నారు..
ఇచ్చిన ప్రతీ హమీని అమలుచేస్తున్న ప్రభుత్వం ఇది, ఈ గెలుపు ద్వారా ఒక స్పష్టమైన తీర్పును తిరుపతి పార్లమెంటు ప్రజలు  ఇవ్వనున్నారు, ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గురుమూర్తి గెలవబోతున్నారు. ఈ అభివృద్ది, సంక్షేమం రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా అందించాలంటే మాకు అవకాశమివ్వమని తిరుపతి ఓటర్లకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.

ఎన్ని డ్రామాలు చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రు..
టీడీపీలో నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తుంది, జరుగుతున్న పరిణామాల నుంచి తప్పుకోవడానికి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న నైరాశ్యానికి ఇది అద్దం పడుతుంది, దానిని పక్కదోవ పట్టించడానికి గులకరాళ్ళ రాజకీయం చేస్తున్నారు, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. 

తిరుపతిలో చరిత్రాత్మక తీర్పు రాబోతుంది..
దళితులందరూ ముక్తకంఠంతో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలుస్తారు, ఏ ఎన్నికలు జరిగినా తీర్పు ఏకపక్షమే, తిరుపతిలో చరిత్రాత్మక తీర్పు రాబోతుంది, మా అభ్యర్ధి రికార్డు మెజార్టీతో గెలవబోతున్నార‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top