ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌ చేసిన మంత్రి సురేష్‌

తాడేప‌ల్లి: ప‌్ర‌వేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తేదీల వారీగా మంత్రి విడుద‌ల చేశారు. సెప్టెంబ‌ర్ 10, 11న ఐసెట్‌, సెప్టెంబ‌ర్ 14న ఈసెట్‌, సెప్టెంబ‌ర్ 17 నుంచి 25 వ‌ర‌కు ఎంసెట్‌, సెప్టెంబ‌ర్ 28, 29, 30 తేదీల్లో జీఈసెట్‌, అక్టోబ‌ర్ 1న ఎడ్‌సెట్‌, అక్టోబ‌ర్ 2 నుంచి 5 వ‌ర‌కు లాసెట్ ఉంటాయ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top