సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

ప్రకాశం:  సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతి అని మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు. ఒంగోలు పట్టణంలో వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆకాశంలో మహిళలు సగం అన్నట్లుగా వైయస్‌ జగన్‌ పాలనలో మహిళలకు అన్నింటా సగం భాగం ప్రాతినిధ్యం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.  ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉంటారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా డ్వాక్రా మహిళల కోసం రూ. 14 వందల కోట్లు విడుదల చేసి వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారన్నారు.   మంచి చేయాలనే మనసు ఉండబట్టే సీఎం వైయస్‌ జగన్‌ ఇవన్నీ చేస్తున్నారని కొనియాడారు.

Back to Top