జ్ఞానభేరి సదస్సులకు కోట్లాది రూపాయల ఖర్చు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఉన్నత విద్యా మండలిలో అవకతవకలు

డ్రైఫ్రూట్స్‌ కోసమే రూ.18 లక్షలు

పసుపు–కుంకుమ పథకానికి రూ.180 కోట్లు నిధులు మళ్లింపు

అమరావతి: ఉన్నత విద్యా మండలిలో భారీగా అవకతవకలు జరిగాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలిలో అవకతవకలపై శాసన మండలిలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిలో అవకతవకలు జరిగాయని, చంద్రబాబు యూనివర్సిటీల్లో జ్ఞానభేరి సదస్సులకు కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.

ఉన్నత విద్యా మండలి నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేవలం డ్రైఫ్రూట్స్‌ కోసమే రూ.18 లక్షలు ఖర్చు చేశారని వివరించారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ పేరుతో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి బావమరిది, వియ్యంకుడు ఉన్నారని చెప్పారు. పసుపు–కుంకుమ పథకానికి రూ.180 కోట్లు నిధులు మళ్లించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని మంత్రి తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top