సభా సంప్రదాయలపై శిక్షణ 

విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్
 

 అమరావతి:  ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయలపై శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎటువంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామని  తెలిపారు. శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులయిన నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని  పేర్కొన్నారు. సమావేశాలు నిర్వహించే  ధైర‍్యం వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వానికి ఉందని, ఏ అంశం పైన అయినా చర్చకు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంద‌న్నారు.  గత ప్రభుత్వం ఎమ్మెల్యే లకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటల్స్‌లో విందులు, డాన్సులతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.

Back to Top