సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పొగాకు రైతుల‌కు దేవుడు 

మంత్రి ఆదిమూల‌పు సురేష్‌
 

ప్ర‌కాశం: చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం పొగాకు రైతుల‌కు తీవ్ర అన్యాయం చేసింద‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్‌బాబు విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పొగాకు రైతుల‌కు దేవుడిగా మారార‌ని తెలిపారు. తొలిసారిగా మార్కెఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోళ్ల‌ను చేప‌ట్ట‌డం ఒక చ‌రిత్ర అన్నారు. లో గ్రేడ్ పొగాకును  కూడా మార్క్‌ఫెడ్ కొంటుంద‌న్నారు.  రైతుల వ‌ద్ద ఉన్న చివ‌రి బేళ్ల‌ను కూడా కొనుగోలు చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. క‌రోనా కష్ట‌కాలంలో పొగాకు రైతుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదుకుంటున్నార‌ని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసేలా  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్నారు. 

Back to Top