ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తాం

మంత్రి కన్నబాబు
 

విశాఖ: విష వాయువులు లీకై ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని, వారికి ప్రభుత్వం పూర్తిగా భద్రత కల్పిస్తుందని, భరోసాగా ఉంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరుగుతుందని కొందరు సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించారని, అలాంటి పరిస్థితులు లేవన్నారు. నిపుణుల కమిటీ రంగంలోకి దిగిందని, పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారన్నారు. ఇవాళ మంత్రుల బృందం భేటీ కాబోతుందని, మూడు అంశాలపై చర్చించబోతున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమల్లో భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.  ప్రజలు పూర్తిగా భద్రతలో ఉన్నామన్న భావన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఫ్యాక్టరీ తెరిపించడానికి ప్రయత్నాలు జరగడం లేదని, తెరవాలా? వద్దా అన్నది నిపుణుల అధ్యాయనంలో వెల్లడవుతుందన్నారు.  ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కన్నబాబు సూచించారు.

Back to Top