ఆ టైమ్‌లో మీరు బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేస్తున్నారా..?

ప్రధాని, సీఎం భేటీపై టీడీపీ, పచ్చమీడియావి పిచ్చి ప్రేలాపణలు

టీడీపీ దిగజారుడు తనాన్ని వర్ణించేందుకు పదాలే లేవు

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే స్వభావం బాబుది

గోబెల్స్‌కు వారసుడు చంద్రబాబు

మండలి రద్దు నిర్ణయంతో యనమల, లోకేష్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది

పచ్చమీడియా స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తోంది

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయితే.. వారిద్దరి భేటీని వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రధాని, సీఎం భేటీ తరువాత టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా కడుపు రగిలిపోతుందన్నారు. భేటీలో ఏ అంశాలు ప్రస్తావించారో.. చంద్రబాబు, యనమలకు ఏం తెలుసు. ఆ టైమ్‌లో పీఎం ఆఫీస్‌లో కార్పెట్‌లు క్లీన్‌ చేస్తున్నారా..? లేక వారిద్దరు తాగిన కాఫీ కప్పులు తీశారా..? బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేస్తున్నారా..? ప్రధాని ఆఫీస్‌లో స్పై కెమెరాలు పెట్టారా..? లేక నరేంద్రమోడీ యనమల, చంద్రబాబుకు ఫోన్‌ చేసి చెప్పారా..? అని ప్రశ్నించారు. పిచ్చి ప్రేలాపణలు, వృథా ప్రయాసగా బాబు, యనమల, ఎల్లోమీడియా పడుతున్న తీరు చూస్తే నవ్వాలో.. జాలి పడాలో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సుదీర్ఘంగా కలిసి మాట్లాడుకుంటే మీకెందుకు కడుపు రగిలిపోతుందని ప్రశ్నించారు. 

కాకినాడలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో ఏం మాట్లారంటే.. ‘కాకినాడలో ఉన్న సాల్ట్‌ భూములను కూడా పేదల గృహ నిర్మాణం కోసం ఇవ్వమని సీఎం వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు సుదీర్ఘంగా దాదాపు వంద నిమిషాలకు పైగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీ తరువాత టీడీపీ నేతలకు కడుపు రగిలి అల్సర్లు పుట్టినట్లుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఎవరు బాగున్నారన్నా.. ఓర్వలేని తనం టీడీపీది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకోవడం మానేసి వారిద్దరు కలిసిన వెంటనే అఘాతం సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోబెల్స్‌కు వారసుడి లాంటి చంద్రబాబు.. ఆయనకు కుడిభుజం లాంటి వెన్నుపోటులో భాగస్వామి యనమల రామకృష్ణుడు నిన్నటి నుంచి చేస్తున్న విషప్రచారం, మాట్లాడే మాటలు ఎంత దిగజారుడు తనంగా ఉన్నాయంటే వర్ణించేందుకు పదాలు లేవు.

కొన్ని పత్రికలు ప్రధానమంత్రి సీఎం వైయస్‌ జగన్‌కు అక్షింతలు వేశారని రాశాయి. ప్రధాని చివాట్లు పెట్టాడని యనమల మాట్లాడుతున్నాడు. లోపల ఏం జరిగిందో మీకు ఏం తెలుసు. ఆ టైమ్‌లో కార్పెట్‌లు క్లీన్‌ చేస్తున్నారా.. లేక వారిద్దరి తాగిన కాఫీ కప్పులు తీశారా..? బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేస్తున్నారా..? ప్రధాని ఆఫీస్‌లో స్పై కెమెరాలు పెట్టారా..? లేక నరేంద్రమోడీ యనమల, చంద్రబాబుకు ఫోన్‌ చేసి చెప్పారా..? పిచ్చి ప్రేలాపణలు, వృథా ప్రయాసగా వారు పడుతున్న తీరు చూస్తే నవ్వాలో.. జాలి పడాలో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సుదీర్ఘంగా కలిసి మాట్లాడుకుంటే మీకెందుకు కడుపు రగిలిపోతుంది. అంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదా..? కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధాలు మెరుగుపడకూడదని భావిస్తున్నట్లుగా అర్థం అవుతుంది. 

ప్రజలు ఎనిమిది నెలల క్రితమే 23 స్థానాలకు పడగొట్టి.. బాబూ నీ స్థానం ఇదే అని తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం, జోలె పట్టడం.. చేతుల్లో పచ్చమీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎనిమిది నెలల పరిపాలనలోనే ఏదో తలకిందులు అయినట్లుగా మాట్లాడుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్‌ టైమ్స్‌లో ఏదో రాశారని మాట్లాడుతున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి జాతీయ పత్రికలు, అంతర్జాతీయ పత్రికల్లో రాతలు రాయించి వాటిని తీసుకొచ్చి ఇలా రాశాయని, మొత్తం నాశనం అవుతుందని సీఎం వైయస్‌ జగన్‌పై బురదజల్లుతున్నారు. అధికారం లేకపోతే గంటకూడా గడపలేని స్థితికి దిగజారిపోయారు. 

దావోస్‌ వెళ్లకపోతే అక్కడున్న పారిశ్రామిక వేత్తలు అంతా కలిసి కూర్చొని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టకూడదని అనుకున్నారంట. ప్రతి సంవత్సరం కోట్లు పెట్టి ఇన్విటేషన్‌ కొనుగోలు చేసి బిల్డప్‌ ఇచ్చి అక్కడ స్టాల్‌ పెట్టి వెళ్లే వాళ్లను పిలిచి భోజనం, టిఫిన్లు పెట్టి చంద్రబాబు ఒక డ్రామా కంపెనీ నడిపారు. అదే తరహాలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాడు. దీనికి నేను లాయర్‌ను, ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుపోటు పొడవాలో నేనే చెప్పాను అన్నట్లుగా యనమల తయారవుతున్నాడు. మండలి రద్దు అయ్యాక యనమల, లోకేష్‌లకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిగజారని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. వ్యక్తిగత అవసరాల కోసం చేతులు పట్టుకునే పద్ధతి సీఎంకు ఉంటే ఇవాళ ఈ ఆరోపణలు రాకుండా ఉండేవీ కాదు. ఆ రోజుల్లోనే కాంగ్రెస్‌ హయాంలో ముఖ్యమంత్రి అయ్యుండేవారు. అందరి కాళ్లు పట్టుకొని స్టేలు తెచ్చుకునే బతుకు చంద్రబాబుది. నరేంద్రమోడీని విమర్శిస్తూ ‘గుండెల్లో నిద్రపోతా’.. ‘అబద్ధాల పుట్ట నరేంద్రమోడీ’.. అని చంద్రబాబు అనడం ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాశాయి. సిగ్గులేకుండా మాట్లాడి.. ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంపీలను నలుగురిని బీజేపీలో జాయిన్‌ చేయించాడు. పాట్నర్‌ను తీసుకెళ్లి పొత్తుపెట్టించాడు. కమ్యూనిస్టులు ఏం మాట్లాడకుండా ఉండేందుకు ఉద్యమంలో కలుపుకున్నాడు. నిరంతరం దిగజారుడు రాజకీయాలు చేయడం తప్ప.. నీతిగా రాజకీయం చేయలేడు.
 
కొన్ని పత్రికలు ఏం రాస్తున్నామనే స్పృహ కూడా కోల్పోయి ప్రవర్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చంద్రబాబు, యనమల, పచ్చమీడియా తయారయ్యాయి. వీళ్లెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు రాయించినా ప్రజలు నమ్మరు’ అని మంత్రి కన్నబాబు అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top