లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌ తీవ్ర అభ్యంతరం

కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు

లోకేష్‌  తెలుగు భాష నేర్చుకోవాలి 

అమరావతిః ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండలిలో లోకేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి వెళ్ళి చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్‌ పార్టీతో  కుమ్మక్కై  వైయస్‌ జగన్‌పై  అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.  23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని ధ్వజమెత్తారు. లోకేష్‌ ముందు తెలుగు భాష నేర్చుకోవాలని హితవు పలికారు. వైయస్‌ఆర్‌సీపీ దేశ చరిత్రలో లేని విధంగా 151 అసెంబ్లీ సీట్లు సాధించిందన్నారు. 50 శాతం ఓట్లను సాధించిందన్నారు.మంగళగిరిని మందలగిరి...జయంతిని వర్ధంతి అని మాట్లాడే వారు గతంలో మంత్రి పదవులు చేపట్టిన దుస్థితి ఉందన్నారు.తెలుగు భాషను నేర్పించడానికి ట్రైనింగ్‌ క్లాసులు పెట్టించాలని ఎద్దేవా చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top