రేషన్‌షాపులపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది

ఉపాధి కల్పిస్తామే తప్ప..పొట్ట కొట్టం..

పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి నాని 

అమరావతిః వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందే తప్ప ఎవరి పొట్ట కొట్టదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.రేషన్‌షాపులను తొలగిస్తానమంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు.గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత రేషన్‌డీలర్లను స్టాకిస్టులుగా మారుస్తామన్నారు.గతంలో ప్రభుత్వంలో రేషన్‌షాపుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు.అర్హులను తొలగించి టీడీపీకి చెందినవారికే డీలర్ల షిప్పులు ఇచ్చారన్నారు.న్యాయబద్దమైన డీలర్ల ఉపాధికి ఎలాంటి ఢొకా ఉండదన్నారు. స్టాకిస్టుల దగ్గర నుంచి వాలంటీర్లు రేషన్‌ సరుకులు తీసుకెళ్తారని తెలిపారు.గతంలో 2014 నుంచి 2019 వరుకు దాదాపు 10వేల మంది అర్హులైన రేషన్‌షాపు డీలర్లను తొలగించారన్నారు.కొంతమందిపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించిన ఉదాంతాలు ఉన్నాయన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top