చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి

ప్రాజెక్టులో భారీ ఎత్తున రేట్లు పెంచారు..

దేశ చరిత్రలో జ్యుడిషియల్‌ విధానం తీసుకొచ్చిన ఘనత వైయస్‌ జగన్‌దే..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతిః చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.ప్రాజెక్టులో భారీ ఎత్తున రేట్లు పెంచిన ఘనత చంద్రబాబుదన్నారు.రూ.16 వేల కోట్లు మేర ఎక్కువ రేట్లు పెంచారు.చంద్రబాబు.. ఒక గేటు ప్రారంభ యాడ్‌కు రూ.2.30 కోట్లు  ఖర్చు పెట్టారన్నారు.శిలాఫలకాల కోసమే ఖర్చు తప్ప ప్రాజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస చంద్రబాబుకు లేదన్నారు.

 దేశ చరిత్రలో టెండరింగ్‌కు జుడీషియల్‌ విధానాన్ని తీసుకొచ్చిన  మెట్టమొదటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రస్తుతించారు.ఎక్కడా లేనివిధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.జ్యుడిషియల్‌ అనుమతి తర్వాతే టెండర్‌ వస్తుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని పనులు ముగ్గురు చేతులపై జరిగిందన్నారు.రింగ్‌గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టు పనులు పంచుకున్నారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top