ఒకరిని కూడా తొలగించం..

మధ్యాహ్న భోజన పథక సహాయకులకు సీఎం  వైయస్‌ జగన్‌ భోరోసా

విశాఖపట్నం: మధ్యాహ్న భోజన పథక సహాయకులకు జీతాలు త్వరలోనే 1000 రూపాయలు నుంచి మూడువేలకు పెంచనున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.విశాఖ శారద పీఠానికి వచ్చిన సీఎంను మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసే మహిళలు కలిశారు.మధ్యాహ్న భోజన తయారీని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించనున్న నేపథ్యంలో తమను ఉద్యోగాలను నుంచి తొలగిస్తారా అంటూ సీఎం  ముందు సందేహాం వ్యక్తం చేశారు.సీఎం స్పందిస్తూ మొత్తం 85వేల మంది వంట చేసేవారిలో ఒకరిని కూడా తొలగించబోమని భరోసా ఇచ్చారు. వంటచేసే వారిని వడ్డించేందుకే పరిమితం చేసి జీతాలను 1000 నుంచి 3వేలకు పెంచబోతున్నట్లు తెలిపారు.దీనిపై వారు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top