టీడీపీ నేత బోండా ఉమ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

గుంటూరు:  అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ నేత బోండా ఉమ‌పై గుంటూరు మేయ‌ర్  మ‌నోహ‌ర్ నాయుడు అరండ‌ల్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.  దమ్ము ధైర్యం ఉంటే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ చ‌ర్చ‌కు రావాల‌ని మేయర్ మనోహర్ నాయుడు స‌వాలు విసిరారు. నువ్వు ప్లేస్ చెప్పినా నేను వస్తాన‌ని చాలెంజ్ చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యాన్ని ధ్వంసం చేస్తాన‌న్న బోండా ఉమ వ్యాఖ్య‌ల‌తో కూడిన పెన్‌డ్రైవ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. టిడిపి నేత పట్టాభి వాడిన అనుచిత వ్యాఖ్యలు బోండా ఉమా కూడా తన ప్రసంగాలు చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా పై చర్యలు తీసుకోవాల‌ని మేయర్ మనోహర్ నాయుడు కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top