రాగద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయకూడదు

గుంటూరు మేయర్ కావటి మనోహర్  

గుంటూరు: రాగద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయకూడదని గుంటూరు మేయర్ కావటి మనోహర్ కోరారు. గురువారం జిన్నా ట‌వ‌ర్ వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా మ‌నోహ‌ర్ నాయుడు మాట్లాడుతూ..రాజకీయ పార్టీలు ఉద్దేశ పూర్వకంగా వివాదం సృష్టించాయని తెలిపారు. జిన్నా పేరు మీదుగా జిన్నా టవర్ ఏర్పాటు చేశారన్నారు. బీజేపీలోని కొంతమంది నేతలు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని...దీంతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని మండిపడ్డారు. జిన్నా టవర్‌కి జాతీయ జెండా రంగులు వేయాలని సీఎం వైయ‌స్ జగన్  సూచించారని తెలిపారు. గుంటూరులో అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారన్నార‌ని మేయ‌ర్ స్ప‌ష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top