అమరావతి: వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని, ప్రాణరక్షణ కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత మేరుగు నాగార్జున ఈసీని కోరారు. సోమవారం ఆయన ఈసీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మంత్రి నక్క ఆనంద్‌బాబు, అతని అనుచరులు తమపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై 307 కేసు నమోదు చేయాలని ఈసీని కోరినట్లు చెప్పారు. మంత్రి, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలన్నారు. ఎస్సీ మహిళ కనకదుర్గపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆమె కేసు పెడితే ఇంతవరకు కూడా కేసు నమోదు చేయలేదు. బట్టిప్రోలు గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు యన్నం సురేష్ అనే వ్యక్తిపై దాడి చేశారు. అతను కూడా కేసు పెట్టారు..ఇంతవరకు కూడా నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. తక్షణమే ఈ నాలుగు సంఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని, మా కేడర్‌కు మనోధైర్యం చెప్పాలని కోరాం. మా కేడర్‌కు, మాకు రక్షణ కల్పించాలని, ప్రోటె„ý న్ ఇవ్వాలని ఈసీని విజ్ఞప్తి చేశాం. మంత్రి నక్క ఆనందబాబు నియోజకవర్గంలో భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆయన్ను నియంత్రించాలని ఈసీని కోరినట్లు మేరుగు నాగార్జున తెలిపారు.