చంద్రబాబు పాలనంతా అవినీతి,అక్రమాలే..

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అన్నివర్గాలకు మేలు

వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున

గుంటూరు:వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలంతా అండగా ఉన్నారని వేమురు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున అన్నారు.వేమూరులో ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి, పేద,బడుగు,బలహీన వర్గాలకు మేలు చేయడానికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాబోతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ పరిపాలనలో ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు. నేడు వ్యవసాయ దండగ అనే పరిపాలన కొనసాగుతుందన్నారు.దివంగత వైయస్‌ఆర్‌ హయాంలో  పేదరైతులకు,కౌలురైతులకు, రైతులకు మేలు జరిగిందన్నారు.చంద్రబాబు పాలనలో వ్యవసాయం అంటే భయపడేలా ఉందన్నారు. కూలీలు,రైతులు అల్లాడుపోతున్నారన్నారు.  పంటకు గిట్టుబాటులేదన్నారు. డ్వాక్రా మహిళలు మోసపోయిన పరిస్థితి అని, నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. స్థానిక  ఎమ్మెల్యే ఇసుక,మట్టి అక్రమాలకు పాల్పడి కోట్లు రూపాయలు దండుకున్నారని విమర్శించారు. 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top