మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు సీఎంకు ఆహ్వానం

సీఎం వైయ‌స్ జ‌గన్‌ను క‌లిసిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు

తాడేప‌ల్లి: శ్రీ‌శైల దేవ‌స్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజ‌రుకావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆల‌య క‌మిటీ స‌భ్యులు కోరారు. ఈ మేర‌కు సీఎంకు బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వానప‌త్రిక‌ను అంద‌జేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌శైలం దేవ‌స్థాన క‌మిటీ ఈవో కే.ఎస్‌. రామారావు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు, క్యాలెండర్‌ అందజేసి.. వేదమంత్రాలతో ఆశీర్వచనం అంద‌జేశారు.  అనంత‌రం శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలతో ప్రచురించిన శ్రీశైలఖండం పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. వ‌చ్చే నెల 4వ తేదీ నుంచి 14 వర‌కు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. 

తాజా ఫోటోలు

Back to Top