ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతికి శాసనమండలిలో సభ్యులు నివాళి

 అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతికి శాసనమండలిలో సభ్యులు నివాళర్పించారు. కరీమున్నీసా సేవలను మంత్రులు, ఎమ్మెల్సీలు కొనియాడారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కరీమున్నీసాకు సంతాప తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీమున్నీసా హఠాన్మరణం చాలా బాధ కలిగిస్తుందన్నారు.

‘‘నిన్నటి వరకు మన మధ్యలో ఉన్న సోదరి ఇవాళ లేరు.  కరీమున్నీసా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎదిగారు. విజయవాడ నగర కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరి మన్ననలను పొందారు. సామాన్యులు కూడా  రాజకీయంగా సముచిత స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో కరీమున్నీసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనమండలికి పంపారు.  కరీమున్నీసా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని.. వారి కుటుంబానికి అండగా ఉంటామని’’ బుగ్గన రాజేంథ్రనాథ్‌ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top