కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలి

మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి
 

విజయవాడ : కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలని  మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్‌ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 20 ఉద్యోగాలు కల్పించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో వైఎస్సార్‌ సెజ్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ టీడీపీ హయాంలో పరిశ్రముల పూర్తిగా గాడితప్పాయని ఆరోపించారు.  

Back to Top