బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

  హైద‌రాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి నెల్లూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వద్దకు ప్రజలు,అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి హెలికాఫ్టర్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకోనుంది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్  వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి మంత్రి గౌతమ్‌రెడ్డి ఇంటికి ఆయన పార్థివదేహాన్ని అధికారులు తరలించనున్నారు.  ఉదయం 11.25కి డైకాస్‌ రోడ్‌లోని క్యాంప్‌ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం చేరుకోనుంది. ఉదయం 11.30 నుంచి ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కృష్ణార్జునరెడ్డి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఆవరణలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.  గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top