ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ 

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ముగిసింది.. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్‌ నెలకొల్పింది. 13 లక్షల మందికిపైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ వేసింది. రాష్ట్రంలో లక్ష్యాన్ని మించి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడిచింది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top