వైద్యులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇక సమృద్ధి

ఏపీ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణా చర్యల కోసం పెద్ద ఎత్తున మెడికల్ ఫెసిలిటేషన్స్ అందిస్తోంది.
PPE కిట్స్ 74,365
N95 మాస్కులు 67,459
ట్రిపుల్ లేయర్ మాస్కులు 14,00,494
టెస్టింగ్ కిట్స్ 7380
రాష్ట్ర జనాభా నిష్పత్తిలో చూస్తే
- 1  :  672
- 1  :  741
- 1  :  36
- 1  :  6775

ఈ నిష్పత్తిలో మెడికల్ ఎక్విప్మెంట్ అందజేయడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు, వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఆధారంగా చూస్తే అవసరమైన మేరకు సరిపోయేలా వీటిని అందిస్తున్నారనే అంటున్నారు నిపుణులు.
ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ చికిత్సల కోసం అవసరమైన మందుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
ఇక మెడికల్ కిట్స్ కోసం భారత్‌లోని అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూసే రోజు కూడా దగ్గరలో ఉంది.
గత ప్రభుత్వ హయాంలో కేంద్రం సాయంతో మొదలై నిరుపయోగంగా ఉండిపోయిన మెడిటెక్ ద్వారా కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయించిన ఏపీ ప్రభుత్వం త్వరలో వివిధ రాష్ట్రాలకూ వీటిని సప్లై చేయగల స్థాయిలో ఉత్పత్తి చేస్తుందనడంలో సందేహం లేదు. 

 

తాజా వీడియోలు

Back to Top