కార్మిక సంక్షేమానికి ప్ర‌భుత్వం నిరంత‌రం కృషి  

గుంటూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో మేడే వేడుక‌లు

జెండా ఆవిష్క‌రించిన మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు:   కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మ‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల పరిశ్రమలు మూత పడిన పరిస్థితి నుంచి ఇవాళ ఎమ్ఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని కొనియాడారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, గుంటూరు జిల్లా అధ్యక్షులు  డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మేడే  వేడుక‌ల్లో మంత్రి అంబ‌టి రాంబాబు పాల్గొని జెండాను ఆవిష్క‌రించారు. కేక్ క‌ట్ చేసి కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు , ముస్తఫా, మద్దాలి గిరిధర్, కిలారి రోశయ్య, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజీలా, తాడిశెట్టి మురళి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుందర్ రెడ్డి పాల్గొన్నారు. 

Back to Top