సీఎం వైయస్‌ జగన్‌ బ్రాండ్‌ చూసి ఏపీకి పెట్టుబడులు 

మంత్రి గుడివాడ అమర్నాథ్‌
 
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి

ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడులు

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది

స్క్రిప్ట్‌ చంద్రబాబుది..స్పీచ్‌ పవన్‌ది

పవన్‌ ఈసారి కూడా గెలిచే అవకాశం లేదు

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బ్రాండ్‌ చూసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు.  గతంలో ఏపీ వైపు చూడని సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. 2022లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం రాష్ట్రానికే వచ్చాయన్నారు. పెట్టుబడులను ఆకర్శించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్ర బ్రాంచ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు చంద్రబాబు, పవన్‌ కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఇండస్ట్రీయల్‌ రెవల్యూషన్‌ వచ్చింది. రాష్ట్రానికి పెద్ద పెద్ద గ్రూపులు వస్తున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు అడుగులు వేస్తున్నాయి, గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఎలక్ట్రికల్, ఐటీ రంగాల్లో సంస్థలు వస్తున్నాయి. ఇన్ని కంపెనీలు ఏపీకి వస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తూ నెగిటివ్‌ బ్రాండ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి తన సొంత సంస్థ హెరిటేజ్‌ను నడుపుతున్నారు. చంద్రబాబును ప్రభుత్వం ఏరకమైన ఇబ్బంది పెట్టిందో చంద్రబాబు చెప్పాలి.

కేవలం అధికారంలోకి రావడానికి ఎదుటి పార్టీపై పోరాటం చేయాల్సింది మానేసి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. రాష్ట్రంలో నాలుగు పోర్టులు, 10 పిషింగ్‌ హార్బర్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో మొదటిస్థానంలో ఉంది. పరిశ్రమలను ఆకర్శించడంలో 2022లో ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాం.

చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడి పారిశ్రామిక విధానం గురించి ఆయన విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒకే రోజు రెండు పత్రికల్లో ఇంటర్య్వూలు ఇచ్చారు. రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బ్రాండ్‌ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. జగన్ను పంపించేద్దామని హెడ్డింగ్‌ పెట్టి వార్తలు రాస్తున్నారు. ఎక్కడికి పంపిస్తారు. మీరు, మీ పార్ట్‌నర్‌ కదా హైదరాబాద్‌ వెళ్లి దాక్కునేది. మిమ్మల్ని కదా రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రానికి పర్మినెంట్‌ చేసింది. 

గడిచిన నాలుగేళ్లలో ఏపీలో మీరు ఉన్నది ఎన్ని రోజులో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు కనిపించదు. మీకు కనిపించేంది కేవలం ప్యాకేజీ మాత్రమే. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఒక రోజు సీఎం అంటారు. మరో రోజు ఎమ్మెల్యే అంటారు. ఇంకో రోజు నేను గెలవను..నాకు ప్రాణ హాని ఉందని చెప్పుకుంటున్నాడు. 

ప‌వ‌న్ కు ప్రాణహాని చంద్రబాబు వల్లే ఉంటుంది. ఇవే మాటలు గతంలో కూడా మాట్లాడారు.
 1995 నుంచి 2023 వరకు అనేక సంఘటనలు గమనించండి. ఎవరైన ఫోకస్‌లోకి వస్తే ఆ వ్యక్తి ఎలిమినెట్‌ అవ్వడం చూశాం. మాధవరెడ్డి చనిపోయిన దగ్గర నుంచి ఇవే చూస్తున్నాం. వీరు నాచూరల్‌గా చనిపోలేదు. ఒకరిని నక్సలెట్లు చంపారని, బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. ఎ్రరంనాయుడు కారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. లాల్‌జాన్‌బాషా, హరికృష్ణ కారు ప్రమాదంలో చనిపోయారు. వీరంతాకూడా టీడీపీలో ద్వితీయ నాయకత్వంగా తయారవుతున్న తరుణంలో చనిపోయారు. వీరి మరణాలపై పవన్‌ తన దత్త తండ్రిచంద్రబాబునే అవమానించాలి.

కాపు నేత వంగవీటి రంగాను చంపిన వ్యక్తిని, ముద్రగడను చంపేయాలనుకున్న వ్యక్తి చంద్రబాబు. అటువంటి వ్యక్తి ఇచ్చిన బిస్కెట్ల కోసం, ప్యాకేజీల కోసం పవన్‌ పరుగెత్తుతున్నాడు. ప్యాకేజీ కోసం కులాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు పవన్‌కు పట్టడం లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.

ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారా? ప్రజల తాలుకా అభిమానం, మన్ననలు పొందాలి. మా కోసం నిలబడుతారని విశ్వసిస్తే ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా మార్చుతారు. 

వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం సోనియాగాంధీని ఎదురించారు. అలాంటి పోరాట యోధుడిని చూసి పవన్‌ నేర్చుకోవాలి. రాష్ట్రంలో ఏరకమైన అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రజల బాగోగులు ఈ ప్రభుత్వం ఏరకంగా చూస్తుందో కళ్లు తెరిచి చూస్తే తేటగా కనిపిస్తాయి. 

రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు 2024లో మళ్లీ ఇవన్నీ వైయస్‌ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదే విషయాన్ని వైయస్‌ఆర్‌సీపీ బలంగా నమ్ముతుంది. నిన్న సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఎమ్మెల్యేల సమీక్షలో స్పష్టంగా చెప్పారని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. 

 

Back to Top