రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రతిప‌క్షాలు ప్రయత్నం 

మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్
 

తూర్పు గోదావ‌రి జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని టీడీపీ నేతలు లేఖలు రాశార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌ (ఇథనాల్‌) పరిశ్రమకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్ధాపన చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు. 
అందరికీ నమస్కారం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ది గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కారణం రోజూ జరుగుతున్న శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు అందరూ చూస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్దికి అడ్డుకట్ట వేసే పరిస్ధితి లేదు. మొన్ననే మీ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి సీఎంగారికి లేఖ రాశారు, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం లేదు, అభివృద్ది జరగడం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు, ఆయన ఒకసారి వచ్చి చూస్తే బావుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని లేఖలు రాస్తారు, జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కళ్ళు విప్పి చూడమని వారికి చెబుతున్నా, రానున్న రోజుల్లో శ్రీ జగన్‌ గారి నేతృత్వంలో పారిశ్రామిక అభివృద్దిని మరింతగా ముందుకు తీసుకెళతాం. రానున్న రోజుల్లో మరో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు కార్యాచరణ జరుగుతుంది, రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా సీఎంగారు అడుగులు ముందుకు వేస్తున్నారు. వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లాను రానున్న రోజుల్లో పారిశ్రామిక జిల్లాగా తీర్చిదిద్దబోతున్నాం, అందరికీ ధన్యవాదాలు.

Back to Top