చేనేత కార్మికులకు అండగా ఉంటున్న ప్ర‌భుత్వం

 మంత్రి గుడివాడ అమర్నాథ్‌

అమ‌రావ‌తి:  చేనేత కార్మికుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని  మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు. బడ్జెట్‌లోనూ చేనేత కార్మికులకు ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని చెప్పారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ చేనేతలకు అందించాల్సిన సబ్సిడీలో రూ. 106 కోట్ల బకాయిలను పెట్టిందని విమ‌ర్శించారు. వైయ‌స్ఆర్ నేతన్న నేస్తం రూపంలో సీఎం వైయ‌స్ జగన్ నేత‌న్న‌ల‌కు అండగా నిలిచార‌ని పేర్కొన్నారు. ఐదు విడత‌ల్లో 82 వేల మందికి రూ.960 కోట్లు వారి  ఖాతాలో జమచేశార‌ని చెప్పారు. ఇతర సబ్సిడీల రూపంలో రూ.40 కోట్ల మీర నేతన్నలకు ప్రయోజనం చేకూర్చార‌ని వెల్ల‌డించారు. ఆప్కో వస్త్రాలను ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నామ‌న్నారు. నేషనల్‌ హ్యాండ్లూమ్‌ బోర్డు కేంద్రం రద్దు చేసింద‌ని వివ‌రించారు. దానిని పునురద్దరించాలని కేంద్రానికి లేఖ రాస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షా 65వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని, చేనేతలకు సంబంధించిన 11 రకాల వస్త్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు హ్యండ్లూమ్‌ రిజస్ట్రేషన్‌ యాక్ట్‌ తెచ్చామ‌న్నారు. కేంద్ర జౌళి శాఖలో 55 శాతం చేనేతకు బడ్జెట్‌ కేటాయింపులనుప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతామ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు.

Back to Top