‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’సెంటిమెంట్‌ను కాపాడతాం..

మంత్రి గుడివాడ అమర్నాథ్  

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మరాదన్నదే మా స్టాండ్

అటువంటప్పుడు ప్రైవేటీకరణ- ఎవరు కొంటారు.. అన్న ప్రశ్నలే ఉత్పన్నం కావు

కేంద్రప్రభుత్వమే ప్లాంట్‌ను నడపాలన్నది మా ప్రభుత్వ డిమాండ్‌

దానికోసం ఇప్పటికే ప్రధానికి మూడుసార్లు లేఖలు రాశాం

అసెంబ్లీలో తీర్మానం చేశాం.. ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నాం..

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

 స్టీల్‌ప్లాంట్‌ కోసం ‘బీఆర్‌ఎస్‌ బిడ్ వేస్తుంది’అన్నవి గాలి వార్తలే

 తెలంగాణ ప్రభుత్వ అధికార స్టేట్‌మెంట్‌ ఇప్పటివరకు మా దృష్టికిరాలేదు

 అయినా.. ప్రయివేటీకరణ వద్దన్న కేసీఆర్‌ మళ్లీ ప్లాంట్‌ను కొంటామంటారా..?

 నిజంగా ఆయన అలా అంటే ప్లాంట్‌ అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా..?

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సూటి ప్రశ్న

 విశాఖ‌: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’సెంటిమెంట్‌ను కాపాడతామ‌ని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దన్నదే మా ప్రభుత్వం, మా పార్టీ స్టాండ్ అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ను కాపాడేందుకు మేం పోరాటం చేస్తూనే ఉన్నాం. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఉద్యమానికి కూడా ప్రభుత్వం తరఫున మేం మద్ధతిచ్చాం. కేంద్రమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడిపించాలని.. ప్రైవేటీకరణకు మా ప్రభుత్వం వ్యతిరేకమని ఇప్పటికే  గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అనేకసార్లు కేంద్రానికి వివరించారు. దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిపి అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వానికి మా ఉద్దేశాన్ని తెలుపుతూ ప్రధానికి ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రి గారు లేఖలు కూడా రాశారని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 
    

బీఆర్‌ఎస్‌ స్టాండ్‌పై క్లారిటీలేదుః
        విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న కేసీఆర్‌ గారు.. మళ్లీ అదే ప్లాంట్‌ను కొంటారని ఎలా అనుకుంటారు..? ఒకవేళ అదే నిజమైతే, ప్లాంట్‌ను అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా..?. అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.  దీనిపై కేసీఆర్‌ గారు గానీ.. బీఆర్‌ఎస్‌ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్‌ను మేం వినలేదు. మా దృష్టికి రాలేదు.

 - స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న మమ్మల్ని ప్లాంట్‌ ను మీరే కొంటారా అని ఎలా అడుగుతారు...? అలాగే, ప్రైవేటీకరణ వద్దని కేసీఆర్‌ చెప్పినప్పుడు ఆయనే మళ్లీ కొనేందుకు ముందుకొస్తున్నారని మీరు ఎలా చెబుతారు.. మీ మీడియాల్లో ఎలా రాస్తారు..? రాజకీయంగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకుని మేం స్పందించలేం కదా.. !

- వాస్తవానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌ ఏదైనా మాట్లాడితే.. వాళ్ల స్టాండ్‌ ఏంటో తెలిశాక అప్పుడు మేం స్పందించడం కరెక్టు గానీ, రాజకీయ దుమారం రేపే గాలివార్తలపై మేం ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముమ్మాటికీ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌గానే మేం భావిస్తున్నాం.. ఆమేరకు ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దన్న విధానంపైనే మా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది.  

Back to Top