చంద్ర‌బాబు స్క్రిప్ట్‌నే హర్ష‌కుమార్ చ‌దువుతున్నారు

మాల‌  కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ పెద‌పాటి అమ్మాజీ

ద‌ళితుల‌కు హ‌ర్ష‌కుమార్ చేసింది ఏమీ లేదు

ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుపై ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది

ఉనికి కోసం చంద్ర‌బాబు, హ‌ర్ష‌కుమార్ తంటాలు ప‌డుతున్నారు

ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని హ‌ర్ష‌కుమార్ దిగ‌జారుస్తున్నారు

ద‌ళితుల స‌మ‌స్య‌ల‌కు, అమ‌రావ‌తికి ఏం సంబంధం

హ‌ర్ష‌కుమార్ ఎంపీగా పోటీ చేస్తే 9 వేల ఓట్లు కూడా రాలేదు

ద‌ళిత వ్య‌తిరేకి చంద్ర‌బాబు కాళ్లు హ‌ర్ష‌కుమార్ ప‌ట్టుకోలేదా?

పుష్క‌రాల్లో చ‌నిపోయిన కుటుంబాల‌కు చంద్ర‌బాబు ఎంత ఇచ్చారు? 

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ చ‌దువుతున్నార‌ని ఏపీ మాల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ పెద‌పాటి అమ్మాజీ మండిప‌డ్డారు. ద‌‌ళితులను అడ్డుపెట్టుకొని మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ రాజ‌కీయాలు చేస్తూ..ఆత్మ గౌర‌వాన్ని దిగ‌జార్చుతున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌ళితుల ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచార‌ని, ఈ ప్ర‌భుత్వంలో ద‌ళితుల‌కు పెద్ద పీట వేశార‌న్నారు. ద‌ళితుల‌ను అవ‌మాన‌ప‌రిచిన చంద్ర‌బాబు కాళ్లు ప‌ట్టుకున్న హ‌ర్ష‌కుమార్ ద‌ళితుల గురించి మాట్లాడ‌టం సిగ్గు చేట‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మాదిగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ క‌న‌కారావుతో, ద‌ళిత నేత‌ల‌తో క‌లిసి పెద‌పాటి అమ్మాజీ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమ‌న్నారంటే..
 
గ‌తంలో వైయ‌స్ఆర్ ద‌య‌వ‌ల్ల రెండుసార్లు ఎంపి అయినా కూడా ద‌ళితుల‌కు ఏమీ చేయ‌లేదు. ఆయ‌న కుటుంబ స్వార్థం కోస‌మే ప‌ని చేశారు. ఈ రోజు చంద్ర‌బాబు స్క్రిప్ట్‌నే హ‌ర్ష‌కుమార్ చ‌దువుతున్నారు. గ‌తంలో ద‌ళితుల‌పై అనేక సంఘ‌ట‌న‌లు, దాడులు జ‌రిగాయి. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక ద‌ళితుల‌పై దాడులు జ‌రిగేవెంట‌నే స్పందిస్తున్నారు. ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుపై ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది.  ఈ ఘ‌ట‌న జ‌రిగితే 24 గంట‌ల్లోనే ఎస్సైని, కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి, సస్పెండ్ చేశామ‌ని గుర్తు చేశారు. దేశ చ‌రిత్ర‌లో ఎప్పుడైనా, ఎప్పుడైనా పోలీసు శాఖ‌పైనా ఇలాంటి చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు ఉన్నాయా? .చంద్ర‌బాబు,  హ‌ర్ష‌కుమార్ ఎందుకు రాజ‌కీయం చేయాల‌ని చూశారో అర్థం కావ‌డం లేదు. ఇంత‌కంటే ఏం యాక్ష‌న్ తీసుకుంటారు. ఒక‌వేళ దాని వెన‌కాల ఎవ‌రున్నారు..ఇలాంటివి తేలాలంటే 90 రోజులు ద‌ర్యాప్తు చేయాల‌ని మీకు తెలియ‌దా?  రాజాన‌గ‌రంలో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం జ‌రిగితే..వెంట‌నే 12 మందిని అరెస్టు చేశారు. చీరాల ఘ‌ట‌న‌పై కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఎవ‌రు చేశారు? ఎలా చేశారు? ఎందుకు చేశార‌న్న కోణంలో విచార‌ణ చేప‌ట్టారు. వాళ్లంద‌రూ కూడా రిమాండ్‌లో ఉన్నారు. అమ్మాయికి వైద్యం చేయించాం. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో ఆలోచ‌న చేస్తున్నారు. ఇలా ప్ర‌తి విష‌యంలో కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ద‌ళితుల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతున్నారు. 

ద‌ళిత యువ‌కుడు ప్ర‌సాద్‌ను హ‌ర్ష‌కుమార్ త‌ప్పుదారి ప‌ట్టించారు. ద‌‌ళిత యువ‌కుడికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటే మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ రాష్ట్ర‌ప‌తికి లేఖ రాయించారు. ఆ కుటుంబాన్ని న‌క్స‌లైట్ల‌లోకి వెళ్లాల‌ని ప్రోత్స‌హిస్తున్నారు. హ‌ర్ష‌కుమార్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ క‌లిసిపోవ‌చ్చు క‌దా?. ద‌ళితుల గౌర‌వాన్ని దిగ‌జార‌చుతూ..అవ‌మానానికి గురి చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. నీ చ‌దువు. నీ రాజ‌కీయ అనుభ‌వం ఏం చేశారు. చంద్ర‌బాబు స్క్రిప్ట్ ప‌ట్టుకొని ద‌ళిత యువ‌కుడి జీవితంతో ఎందుకు ఆడుకుంటావు. నీకు అంత‌గా చేరాల‌నుకుంటే చంద్ర‌బాబుతో క‌లిసి న‌క్స‌లైట్ల‌తో క‌లిసిపోవాలి. ఈ కేసుపై ఇంకా ద‌ర్యాప్తు చేస్తాం. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు. ఈ విష‌యంలో హ‌ర్ష‌కుమార్ రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాలి. హ‌ర్ష‌కుమార్ త‌న ఉనికి కాపాడుకునేందుకు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. చంద్ర‌బాబును కూడా ప్ర‌జ‌లు మ‌రిచిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో ఏదో ఒక‌టి ప‌ట్టుకొని ప‌చ్చ‌మీడియా ముందు ఏదో ఒక‌టి మాట్లాడ‌క‌పోతే మేం క‌న‌బ‌డ‌మేమో అన్న అనుమానంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. టీవీల్లో క‌నిపించ‌డం కోస‌మే ద‌ళితుల‌ను వాడుకుంటున్నారు. ద‌ళితుల గౌర‌వాన్నిపాడుచేస్తున్న హ‌ర్ష‌కుమార్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని అమ్మాజీ హెచ్చ‌రించారు. 

రాజ‌కీయంగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌య‌తో ఎదిగిన హ‌ర్ష‌కుమార్‌..ఇప్పుడు రాజ‌కీయ నిరుద్యోగి అయ్యారు. ఏం చేయాలో తెలియ‌క ఇంట్లో కూర్చొని చంద్ర‌బాబుతో మాట్లాడి..ఏదో ఒక‌టి ప‌ట్టుకొని ఎల్లోమీడియాలోకి వ‌చ్చిన అల్ల‌రి చేస్తున్నారు. ద‌ళితుల విష‌యాల‌ను ఎందుకు అల్ల‌రి పాలు చేస్తారు? అవ‌కాశ వాద రాజ‌కీయాలు మానుకోవాలి. చంద్ర‌బాబు గ‌తంలో ద‌ళితులుగా ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా అని బ‌హిరంగ స‌భలో అన్నారు. త‌న హ‌యాంలో ద‌ళితుల‌ను దూరంగా పెట్టారు. అలాంటి స‌మ‌యంలో హ‌ర్ష‌కుమార్ ఏమ‌య్యారు. చంద్ర‌బాబును ఎప్పుడైనా ఈ హ‌ర్ష‌కుమార్ ప్ర‌శ్నించారా? అప్పుడు ద‌ళితుల‌పై ఉన్న ప్రేమ ఏమైంది? . ద‌ళితుల‌ను అవ‌మాన‌ప‌రిచిన చంద్ర‌బాబు కాళ్లు ప‌ట్టుకున్న హ‌ర్ష‌కుమార్ ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టారు.

 ద‌ళితుల గురించి ప్రెస్‌మీట్ పెట్టి..రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి హ‌ర్ష‌కుమార్ మాట్లాడుతున్నారు. మూడు రాజ‌ధానులు పెట్ట‌డం వ‌ల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ఇదే ప్రెస్‌మీట్లో క‌రోనా గురించి కూడా మాట్లాడారు. క‌రోనా విష‌యంలో ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌ని విధంగా టెస్టులు చేస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు దేవుడిగా గొప్ప‌గా ప‌రిపాల‌న చేస్తున్నారు. ఐదునెల‌ల కాలంలో వైద్య రంగంలో అనేక పోస్టులు భ‌ర్తీ చేశారు. క‌రోనా రోగులంద‌రికీ మెరుగైన వైద్యం అందిస్తుంటే మీకు క‌నిపించ‌డం లేదా?..మంచి ఆరోగ్యం పెడుతున్నారు. ఇంట్లో కంటే ఆసుప‌త్రిలోనే మెరుగైన సేవ‌లు అందిస్తుంటే మీరు విమ‌ర్శ‌లు చేస్తారా? . ప్ర‌జ‌ల‌కు ధైర్యాన్ని క‌లిగిస్తుంటే..హ‌ర్ష‌కుమార్ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది. హ‌ర్ష‌కుమార్ ప్రెస్‌మీట్ చూసి ప్ర‌జ‌లంతా న‌వ్వుతున్నారు. అమ‌లాపురం పార్ల‌మెంట్‌లో నీకు ఎంత ఓటింగ్ వ‌చ్చిందో మ‌రిచిపోయారా?. 9 వేల ఓట్లు రాలేదే. మీ అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 700 ఓట్లు  కూడా రాలేదు. అది నీ బ‌తుకు..ద‌ళితుల‌కు మాట్లాడ‌టానికి హ‌ర్ష‌కుమార్‌, చంద్ర‌బాబు స‌రిపోరు. ద‌ళితుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎంత పెద్ద పీట వేశారో మీకు క‌ళ్లు క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు హ‌యాంలో ఇద్ద‌రికి మంత్రి శాఖ‌లు ఇస్తే..ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క‌మైన ఐదు శాఖ‌ల‌ను ఉచ్చి ద‌ళితుల‌కు స‌రైన గౌర‌వం ఇచ్చారు. న‌న్ను, క‌న‌కారావుల‌ను చైర్మ‌న్ ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించారు. 

ద‌ళితుల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న సీఎంను అన‌డానికి హ‌ర్ష‌కుమార్‌కు నోరు ఎలా వ‌చ్చిందో ఆలోచ‌న చేయాలి. ద‌ళితుల విష‌యాల‌ను రాజ‌కీయాలకు వాడుకోవ‌డం స‌రికాదు. రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ఇస్తే..స‌రిపోతు కోటి ఇవ్వాలంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ద‌ళితుల‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చ‌ర్చ‌కు సిద్ధ‌మా?. రాజ‌మండ్రి పుష్క‌రాల్లో 30 మంది చ‌నిపోతే ఎంత  ఇచ్చారో మీరు ఎందుకు ఆడ‌గ‌లేక‌పోయారు. చంద్ర‌బాబు వల్లే పుష్క‌రాల్లో చ‌నిపోతే అప్పుడు గుడ్డి గుర్రాల‌కు ప‌ళ్లు తోముతున్నారా? అప్పుడెందుకు మాట్లాడ‌లేదు?. త‌ప్పు చేస్తున్నావు హ‌ర్ష‌కుమార్‌..అంటూ అమ్మాజీ హెచ్చ‌రించారు. 

 

తాజా వీడియోలు

Back to Top