డ్వాక్రా మహిళలపై ఉన్న చిత్తశుద్ధి ఇదేనా

పరిటాల సునీత పర్యటనను అడ్డుకునేందుకు వచ్చిన మహిళలు అరెస్టు

తోపుదుర్తిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి

మహిళల అరెస్టును ఖండించిన వైయస్‌ఆర్‌ సీపీ

రాప్తాడు: పోలీసుల ఓవర్‌యాక్షన్‌ రోజు రోజుకు మితిమీరిపోతుంది. అధికార పార్టీ అండతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో మంత్రి పరిటాల సునీత పర్యటన నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు తీర్మానించారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తిలో పోలీసులు భారీగా మోహరించారు. మంత్రిని నిలదీసేందుకు వెళ్లిన మహిళలను అడ్డుకున్నారు. పోలీసులు, మహిళలకు జరిగిన తోపులాటలో పలువురు మహిళలు గాయాలయ్యాయి. రుణమాఫీ గురించి అడిగేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో ఒక మహిళ మంగళసూత్రం తెగిపోయింది. అంతేకాకుండా మరికొంతమందికి గాయాలయ్యాయి. దీంతో తోపుదుర్తిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

తీవ్రంగా ఖండించిన వైయస్‌ఆర్‌ సీపీ

డ్వాక్రా మహిళల అరెస్టును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. డ్వాక్రా మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా..? నాలుగున్నరేళ్లుగా డ్వాక్రా మహిళల రుణాలు ఎందుకు రద్దు చేయలేదని ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌ సీపీ ప్రశ్నించింది. డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. 

 

Back to Top