రాజమండ్రిలో కదం తొక్కిన మహిళాలోకం

వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహిళా స్వరం

చంద్రబాబు మోసాలను ఎండగట్టినా వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలు

తూర్పు గోదావరి: రాజమండ్రి వేదికగా మహిళలు కదం తొక్కారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను మహిళా నాయకురాళ్లు ఎండగట్టారు. మంగళవారం రాజమండ్రిలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో మహిళా స్వరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రోజా బైక్‌ ర్యాలీ ప్రారంభించి, స్కూటర్‌పై వేదిక వద్దకు వచ్చారు.

రాష్ట్రంలో చంద్రబాబు అనుసరిస్తు న్న మహిళ వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయవలసి న తరుణం ఆసన్నమైందని వైఎస్సార్‌ సీపీ మహిళ అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. తాను ఎంతో అనుభవజ్ఞుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాలను కాపీ కొడుతున్నాడన్నారు. దివాన్‌చెరువులో రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ ‘మహిళ స్వరం’ బహిరంగ సభలో రోజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అధికార పక్షానికి, ప్రతిపక్షానికి చెరొక మేనిఫెస్టో ఉం టుందని, కాని చంద్రబాబుకు అవేమీ లేవన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలనే చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు.

ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి రూపొందిం చిన నవరత్నాలును కూడా కాపీ కొడుతూ మరోసారి మహిళలను మభ్యపెట్టేందుకు పసుపు కుంకుమ పేరుతో ‘ఎర’వేస్తున్నాడని ఆరోపించారు. పోస్టు డేట్‌తో చెక్కుతో మరో మోసానికి తెర తీశారని ధ్వజమెత్తారు. సరైన నిర్ణయం తీసుకోండి, రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన వద్దని చెప్పండి, రాజన్న రాజ్యం అందించే జగనన్నను సీఎంని చేయాలని పిలుపునిచారు. డ్వాక్రా సంఘాల అప్పు రూ.22 వేల కోట్ల పెరిగిందన్నారు. ఇక మహిళలపై దాడులకు తహసీల్దార్‌ వనజాక్షి ఉద్దంతమే ఉదాహరణ అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఆయన కొడుకు లోకేష్‌కి అడ్డదారిలో ఉద్యోగం ఇచ్చుకున్నాడు, ‘కుటీర లక్ష్మి’పేరుతో ప్రతి మహిళలను ఒక పారిశ్రామికవేత్తను చేస్తానన్నాడు, ఆయన కోడలు బ్రాహ్మిణిని పారిశ్రామికవేత్తను చేశాడన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకంలో రూ. 15 వేలు ఇస్తారన్నారు. పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తానని చెప్పడం జగన్‌కి మహిళలపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. పీఏసీ సభ్యురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ మన జిల్లాలో మండపేట నియోజవర్గంలోని ఊరవెళ్లి గ్రామంలో మహిళలను విచక్షణా రహితంగా పోలీసులతో కొట్టిన ఘనుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 

సమరయోథుల వారసులకు సన్మానం
స్వాతంత్య్ర సమరయోధుల కుటుం బాలకు చెందిన ఖండవల్లి లలితకామేశ్వరి, రాచర్ల సుశీలదేవి, రాయపూడి తాలమ్మ, తాళ్లపూటి పద్మజ, కుసుమ సుజాతకుమారి, మాచిరాజు కృష్ణశ్రీ, ముసలూరి పద్మావతి ఘనం సన్మానించారు.

దివాన్‌చెరువుకు పోటెత్తిన ఆడపడుచులు
మధురపూడి/దివాన్‌చెరువు: మహిళా స్వరం బహిరంగ సభకు మహిళా లోకం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహిళాలోకం భారీగా, స్వచ్ఛందంగా తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి దివాన్‌చెరువు జాతీయ రహదారిపై ప్రత్యేకమైన సందడి నెలకొంది. సభలో మహిళా నాయకులు, వారి స్వరాలతో సభా ప్రారంగణం దద్దరిల్లింది. పార్టీ మహిళ విభాగం ప్రతినిధులు మాజీ మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్షి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షులు అమ్మాజీ, కాళీ మునికుమారి, నల్లమిల్లి కాంతమ్మ, నగర పాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, కాకినాడ నగర పాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ రాగిరెడ్డి చంద్రకళదీప్తి, రంపచోడవరం, రాజమహేంద్రవరం, కొవ్వూరు, రాజానగరం కో ఆర్డినేటర్లు ధనలక్ష్మి, పిల్లి నిర్మల, తానేటి వనిత, కె.రాజారమాదేవి, రాష్ట్ర కార్యదర్శి షబ్‌న్మమ్‌ అప్సర, నగర కన్వీనర్‌ మార్త లక్ష్మి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట భాపన సుధారాణి, గున్నం వనిత, అనసూయ, ఉమామహేశ్వరి, శాంతకుమారి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ మార్గని భరత్, సమన్వయకర్తలు చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, సత్తి సూర్యనారాయణరెడ్డి, అనంత ఉదయ్‌భాస్కర్, దవులూరి దొరబాబు, ఆర్‌వీవీఎస్‌ చౌదరి, కర్రి పాపారాయుడు, మిండకుదుటి మోహన్, మండల కన్వీనర్లు మందారపు వీర్రాజు, వుల్లి బుజ్జిబాబు, డాక్టర్‌ బాబు, నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, దేశాల శ్రీను, వాసంశెట్టి పెద్ద వెంకన్న, బొర్సి బద్రి, దుర్గారావుతదితరులు పాల్గొన్నారు.  

 

Back to Top