సీఎం వైయస్‌ జగన్‌తో మహారాష్ట్ర బృందం

దిశ చట్టంపై సీఎం వైయస్‌ జగన్‌కు అభినందనలు
 

తాడేపల్లి: చిన్నారులు,మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వచ్చింది. ఈ బృందం సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి అభినందనలు తెలిపింది.  దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, డీజీపీ సుబోత్‌కుమార్‌ జైశ్వాల్‌, అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బృందం సీఎంతో చర్చించింది. ఈ భేటీలో   ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌, డీజీపీ, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ ఉన్నారు. 
 

Back to Top