సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌హారాష్ట్ర రైతు

800 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ తాడేపల్లికి వ‌చ్చిన మ‌హారాష్ట్ర రైతు

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతు సంక్షేమానికి చేస్తున్న కృషిని గ‌మ‌నించిన మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ రైతు అభిమానంతో సైకిల్ యాత్ర‌గా బ‌య‌లుదేరాడు. 800 కిలోమీట‌ర్లు సైకిల్‌పై ప్ర‌యాణించి ఎట్ట‌కేల‌కు ఇవాళ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌ను మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే క‌లిశారు. సీఎం వైయ‌స్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా నుంచి 800 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ కాక్డే తాడేపల్లి వచ్చారు. ఈ నెల 17 న అక్కడి నుంచి బయలుదేరిన కాక్డే ఇవాళ ముఖ్య‌మంత్రిని క‌లిశారు. కాక్డేని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Back to Top