మహానేతకు వైయస్‌ జగన్‌ నివాళి

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పులివెందులలో చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియల అనంతరం వైయస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్నారు. మహానేత సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైయస్‌ జగన్‌ వెంట పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

 

Back to Top