తాడేపల్లి: విశాఖ డ్రగ్స్ విషయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైయస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు మండిపడ్డారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారం సీఎం వైయస్ జగన్‌కు ఆపాదించడం బోడుగుండికి బొటినవేలుకి ముడివేసిన సందంగా టీడీపీ తీరు ఉందని కొమ్మూరి కనకారావు విమర్శించారు. నిన్న విశాఖ పట్నం లో భారీఎత్తున దొరికిన డ్రగ్స్ కేసులో సంధ్యా ఆక్వా కంపెనీ కి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కనకారావు స్పష్టం చేశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రావు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా సహాయం చేస్తూ ఉండే వ్యక్తి అని, కేవలం ఈదుమూడి గ్రామంలో తన కుటుంబం ఆదిపత్యం కోసం కూనం పూర్ణచంద్రరావు, వీరభద్ర రావు కలిసి పని చేయడం , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వినాచనకారిగా మారిన తీరుపట్ల పట్ల అదే గ్రామానికి చెందిన ఎస్సీ, బిసీలు ఎదురు తిరిగి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని కనకరావు గుర్తు చేశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు కి టీడీపీ కి చెందిన దామచర్ల జనార్ధన్ రావు, సత్యకు, ఘంటా శ్రీనివాసరావు కి సంబంధం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వీరికి ధన సహాయం చేస్తుంది వాస్తవం కాదా? అని కనకరావు నిలదీశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ని పెంచి పోషించి ఆర్ధికంగా ఎదిగేందుకు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త సహకారం లేదని బహిరంగంగా చెప్పగలిగే దమ్ముందా అని సవాలు విసిరారు. సంక్రాంతికి ఈదుమూడి వచ్చిన కూనం వీరభద్రరావును టిడిపి నాయకుడు దామచర్ల సత్య కలిసింది వాస్తవం కాదా? మద్దిరాల గ్రామంలో సంక్రాంతి రోజు సంధ్యా ఆక్వా కంపెనీ వారు ఇచ్చిన పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొంది వాస్తవం కాదా? అన్నారు. టీడీపీ వారు ప్రతిదీ రాజకీయం చేయడం, ప్రజలను తప్పు దారి పట్టించడం సహజంగా మారిందని కనకరావు మండిపడ్డారు. ఇంటర్ పోల్ సహకారంతో సిబిఐ అధికారులు గరుడ పేరుతో జరిపిన దాడుల్లో విశాఖలో డ్రగ్స్ దొరకగా, ఈ డ్రగ్స్ యువతలోకి వెళ్ళకుండా నిరోదించిన సీబీఐని అభినందించకపోగా, ఇది వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపాదించడం టీడీపీ వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట చర్య అని దుయ్యబట్టారు. తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా సంధ్యా ఆక్వా కంపెనీ ఆర్ధికంగా ఎదిగిన తీరు, ప్రారంభంలో ఉన్న కంపెనీ డైరెక్టర్ లు వారి ఆర్ధిక స్థాయిపై, సంధ్యా ఆక్వా కంపెనీ అకౌంటు లపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు చేయాలని కొమ్మూరి కనకరావు డిమాండు చేశారు.