ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారు
26 Nov 2022 11:10 AM
లండన్ ఎంపీ కితాబు
లండన్ ఎంపీకి జగనన్న సంక్షేమ బ్రోచర్ అందిస్తున్న మేయర్ వసీం
అనంతపురం: లండన్‌లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మెన్‌ను అనంతపురం మేయర్ వసీం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచినా ఆయన చాలా నిరాడంబరంగా తనతో గంటపాటు ముచ్చటించారని మేయర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందించి వివరించానన్నారు.
సచివాలయ – వలంటీర్ వ్యవస్థ, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన కితాబునిచ్చారన్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారని ప్రశంసించారన్నారు. లండన్‌లోని కట్టడాలు, కొత్త ఆలోచనలను అనంతపురం నగరపాలక సంస్థలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.