ఏపీ డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటం

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి

లోక్‌సభ వైయస్‌ఆర్‌ సీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్లను నెరవేర్చే వరకు కేంద్రప్రభుత్వంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని లోక్‌సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ అన్నారు. ప్రాజెక్టుల అంశాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి  మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.  

పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాఫర్‌ డ్యామ్‌ వద్ద జలాశయంలో నీరు నిలిచిందని, వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించకపోతే మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి సంబంధించిన డిమాండ్లను పూర్తిగా కేంద్రం నెరవేర్చాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top