ఆ లేఖ అవాస్తవం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయస్‌ భారతి లేఖ రాసినట్లుగా సోషల్‌ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. వైయస్‌ భారతి రాసిన ఉత్తరం అంటూ ఒక మెసేజ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, ఆ ఉత్తరం, మెసేజ్‌తో వైయస్‌ భారతికి ఎలాంటి సంబంధం లేదని పార్టీ పేర్కొంది. మెసేజ్‌ తయారు చేసి సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది. 
 

Back to Top