వెన్న‌పూస‌ల ర‌వీంద్ర‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే డాక్ట‌ర్ తిప్పేస్వామి
 

సత్యసాయి జిల్లా :  రాయ‌ల‌సీమ ప‌ట్ట‌బ‌ధ్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న వెన్న‌పూస‌ల ర‌వీంద్ర‌రెడ్డిని ఎమ్మెల్సీగా అత్య‌ధిక మెజారిటీతో గెలిపించుకుందామ‌ని ఎమ్మెల్యే డాక్ట‌ర్ తిప్పేస్వామి పిలుపునిచ్చారు.  మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు హక్కు నమోదు కార్యక్రమoలో  చేప‌ట్టారు. ఇందులో భాగంగా మడకశిర నగరపంచాయతీ లోని 5, 6, 7వ వార్డులలో ఓటు హక్కు కార్యక్రమన్ని నిర్వహించి, అవగాహన కల్పించారు. వెన్నుపూసల రవీంద్ర రెడ్డి  నాయకత్వన్ని బలపరిచి మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఎమ్మెల్సీగా గెలిపించాల‌ని ప‌ట్ట‌బ‌ధ్రుల‌ను తిప్పేస్వామి అభ్య‌ర్థించారు. కార్యక్రమం లో  మడకశిర నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ జయరాజు, కౌన్సిలర్స్ విక్రమ్, దాసన్న, మధు, గోపి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top