ఉత్తమ ఫలితాల కోసం చివరి దాకా పోరాడదాం

ట్విట్టర్‌లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు వచ్చిన తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని వైయస్ ఆర్  కాంగ్రస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు , పోలింగ్ బూత్ స్థాయి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటరు జాబితాల్లో పేర్లను సరిచూసుకోడానికి, పేర్లు లేని వారు తమ పేర్లను నమోదు చేసుకోడానికి ఇంకా రెండు రోజులే సమయముందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ... నాలుగేళ్లుగా ప్రతి అంశంలోనూ అందరం కష్టపడ్డామన్నారు. ఉత్తమమైన ఫలితాల కోసం పోరాడేలా,  చివరి క్షణం వరకు కూడా వైయస్ఆర్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top