తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో అసలు వరద గురించిన ప్రస్తావనే లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు వరద బాధితుల గురించి కాకుండా.. శ్రీలంక గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దారి పొడవునా ఆయన డప్పు తప్ప ఏం లేదన్నారు. ఈ విధంగా ఎవరైనా వరద బాధితులను పరామర్శిస్తారా అని అప్పిరెడ్డి ప్రశ్నించారు.